రైతు పేరు : కొడుముర్తి పుల్లయ్య 
గ్రామం  : కుప్పాలపల్లి (H/W)
మండలం  : వేంపల్లి
జిల్లా   : YSR కడప
రాష్ట్రం :  ఆంధ్రప్రదేశ్

 

 

 

సమస్య : వేంపల్లి మండలంలోని కుప్పాలపల్లి గ్రామానికి చెందిన కొడుముర్తి పుల్లయ్య మరియు కమ్మటి గోవిందమ్మ అనే వీరు 2020 జూన్ మరియు జులై నెలలో జరిగిన ఉపాధి పనికి వెళ్లి గోవిందమ్మ  18 రోజులు, పుల్లయ్య గారు 30 రోజులు పని చేయడం జరిగింది.  చేసిన పనికి సంబంధించి 6 నెలలు అయిన కూలి డబ్బులు రాకపోవడంతో, ఉపాధి హామీ ఆఫీస్ కు చాలా సార్లు వెళ్లడం జరిగింది.

  • అధికారులు మాత్రం డబ్బులు అందరికి చెల్లించడం జరిగింది కాబట్టి మీకు కూడా డబ్బులు వేయడం జరిగింది అకౌంట్ లో చూసుకోమని చెప్పారు. బ్యాంక్ అకౌంట్ లో చూస్తే  డబ్బులు జమ కాలేదు. తరువాత కడప గ్రీవెన్స్ కూడా వెళ్లడం జరిగింది అయినప్పటికీ డబ్బులు రాకపోవడంతో, ఆఫీసుల చుట్టూ చాలా సార్లు తిరిగి తిరిగి పని చేసిన కూలి డబ్బుల పైనా ఆశ వదులుకొని మా కూలి డబ్బులు ఫీల్డ్ అసిస్టెంట్ తీసుకున్నాడనేమో అనే అపోహతో ఇంక ఆ డబ్బులు రావనే నిరాశ తో వున్నారు.

కిసాన్ మిత్ర చేసిన పని : కొడుముర్తి పుల్లయ్య గారికి సుస్థిర వ్యవసాయ కేంద్రం(CSA) ద్వారా నిర్వహిస్తున్న కిసాన్ మిత్ర హెల్ప్ లైన్ ద్వారా చేస్తున్న సేవల గురించి తెలుసుకొని కిసాన్ మిత్ర హెల్ప్ లైన్ కు కాల్ చేయడంతో కిసాన్ మిత్ర టీం వెళ్లి పుల్లయ్య మరియు గోవిందమ్మ గారితో మాట్లాడి ఉపాధి కూలి డబ్బుల పెండింగ్ గురించి ఉపాధి హామీ ఆఫీస్ కు వెళ్లి MCC మంజుల గారితో మాట్లాడగా ఉపాధి కూలి డబ్బులకు సంబంధించి నవంబర్ వరకు అందరికి చెల్లించడం జరిగింది అని చెప్పారు.

  • కానీ వీరి బ్యాంక్ అకౌంట్  స్టేట్మెంట్ చూడగా డబ్బులు జమ కాకపోవడంతో వారి జాబ్ కార్డుకు లింక్ అయిన ఆధార్ కార్డ్ మరియు బ్యాంక్ అకౌంట్ ను వేరిఫై చేయగా తప్పు ఆధార్ కార్డ్ నమోదు చేసి వుండడంతో ప్రస్తుతం ఉన్న ఆధార్ కార్డ్, బ్యాంక్ అకౌంట్, జాబ్ కార్డులను MCC ద్వారా కడప డ్వామా ఆఫీస్ కు పంపించడం జరిగింది.
  • తరువాత కూడా మండల ఉపాధి హామీ ఆఫీస్ ద్వారా ఫాలో అప్ చేయగా కొడుముర్తి పుల్లయ్య గారికి 30 రోజులకు గాను 7051/- రూపాయలు, కమ్మటి గోవిందమ్మ గారికి 18 రోజులకు గాను 4166/- రూపాయలు వారి అకౌంట్ లో జమకావడం జరిగింది.

పుల్లయ్య, గోవిందమ్మ గారి స్పందన : కిసాన్ మిత్ర హెల్ప్ లైన్ కు ఫోన్ చేయడం ద్వారా సంవత్సరం నుండి పెండింగ్ లో ఉన్న ఉపాధి పని చేసిన కూలి డబ్బులు ఇప్పించడంలో సహకరించిన కిసాన్ మిత్ర టీం కు ధన్యవాదాలు తెలిపినారు.