రైతు పేరు : సానేపల్లి ఈశ్వరమ్మ
గ్రామం  :రేగుళ్లపల్లి
మండలం  : ప్రొద్దుటూరు
జిల్లా   : YSR కడప
రాష్ట్రం : ఆంధ్రప్రదేశ్

 

 

రేగుళ్లపల్లి గ్రామంలో ఫసల్ భీమా యోజన గురించి అవగాహన కల్పిస్తున్న దృశ్యం

సమస్య:  ప్రొద్దుటూరు మండలంలోని రేగుల పల్లి గ్రామంలో రైతులు 2018 మరియు 2019 – 2020 సంవత్సరంలో పత్తి పంటను సాగు చేశారు.  పత్తి పంట వరుస తుపానుల వలన పంటలు నాశనం అయినవి, తద్వారా రైతులకు తీవ్ర నష్టం జరిగింది. 

  • అప్పట్లో రైతులు ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన పథకంలో ఒక్క రూపాయి చెల్లించి పత్తి పంటకు ఇన్సూరెన్స్ చేయించారు, అందువలన ప్రభుత్వము 2019- 20 సంవత్సరాల కాలంలో పత్తి పంట వేసి నష్టపోయిన రైతులకు ప్రధానమంత్రి ఫసల్ బీమా ద్వారా ఇన్సూరెన్స్ అమౌంటు చాలామందికి రావడం జరిగింది. 
  • కానీ రేగుళ్ల పల్లి గ్రామంలో రైతులు ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన ఇన్సూరెన్స్ డబ్బులు కోసం అధికారుల చుట్టూ తిరిగారు, కానీ సరైన స్పందన లేదు.  ఈ విషయమై అగ్రికల్చర్ అధికారులు శివశంకర్ రెడ్డి గారికి కూడా తెలపడం జరిగిందని రైతులు చెప్పారు.

కిసాన్ మిత్ర చేసిన పని : రేగుళ్లపల్లె గ్రామంలో రైతులకు ఫసల్ బీమా యోజన గురించి అవగాహన కల్పించడం జరిగింది అప్పుడు వారు చాలామంది మాకు పసల్ బీమా యోజన డబ్బులు రాలేదని చెప్పినారు.  ఈ విషయాన్నికిసాన్ మిత్ర  హెల్ప్ లైన్ కి కాల్ చేసి  చెప్పారు.  ఆ విషయమై మండల అగ్రికల్చర్ అధికారి గారికి దృష్టికి తీసుకెళ్లగా అందుకు వారు ఎర్రర్ లిస్ట్ లో ఉందని చెప్పారు.

  •  ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన ఇన్సూరెన్స్ డబ్బులు రాని వారు అర్జీలు పెట్టుకోవాలని సూచించారు.  ఈ విషయం రైతులకు తెలుపగా రైతులందరూ డాక్యుమెంట్లు ఇవ్వడం,  తరువాత స్వయంగా లెటర్ తయారు చేయడం,  గ్రామం తరపున తయారుచేసిన లిస్ట్ ను మండల అగ్రికల్చర్ అధికారికి ఇవ్వగా వారు రికమండ్ లెటర్ రాసి జిల్లా అధికారి కార్యాలయంలో ఇవ్వాలని చెప్పారు.
  • తర్వాత జిల్లా అగ్రికల్చర్ ఇన్సూరెన్స్ అధికారి విజయకుమార్ గారి దృష్టికి తీసుకెళ్లగా వారు  పరిశీలించి ఇకమీదట డబ్బులు వస్తాయి అని చెప్పారు.  తర్వాత కొందరికి  డబ్బులు వచ్చాయి కొందరికి రిజెక్ట్ అయినవి,  కారణం ఏమంటే ఇన్సూరెన్స్ అప్లికేషన్ పెట్టుకునే సమయంలో సరైన పత్రాలు సమర్పించడం లేదని తెలిపినారు.
  • ఈ విషయంలో ఇన్సూరెన్స్ డబ్బులు రావని అందరూ అనుకున్నారు.   కిసాన్ మిత్ర టీం వారికి అండగా నిలిచి ఇన్సూరెన్స్ డబ్బులు వచ్చేలాగా ప్రయత్నం చేయడం ద్వారా రైతులు సంతోషం వ్యక్తం చేశారు.

రేగుళ్లపల్లి గ్రామ రైతుల అభిప్రాయం : కిసాన్ మిత్ర హెల్ప్ లైన్ కి ఫోన్ చేయటం ద్వారా సమస్యను పరిష్కరించటంలో కిసాన్ మిత్ర టీం పూర్తి సహాయ సహకారాలు అందించి మాకు ఇన్సూరెన్స్ డబ్బులు వచ్చేలా కృషి చేసారు, వారికీ ధన్యవాదాలు…