రైతు పేరు. : పండుగాయాల బుచ్చయ్య
గ్రామం : ఎస్.మైదుకూరు
మండలం : ఎస్.మైదుకూరు
జిల్లా. : వై.యస్.ఆర్.కడప
రాష్ట్రం : ఆంధ్రప్రదేశ్
సమస్య : ఎస్.మైదుకూరు మండలంలోని ఎస్.మైదుకూరు గ్రామానికి చెందిన పండుగాయాల బుచ్చయ్యకు రైతు భరోసా డబ్బులు రావడం లేదు అని పలుమార్లు రెవెన్యూ మరియు అగ్రికల్చర్ అధికారుల దృష్టికి తీసుకెళ్లినా ఫలితం లేకుండా పోయింది. రైతు చాలా సార్లు వాలంటీర్ ద్వారా రైతు భరోసా కేంద్రంకు వెళ్లి తెలియజేసిన కూడా రైతు భరోసా డబ్బులు రాకపోవడంతో ఇంకా రైతు భరోసా డబ్బులు రావని నిరాశతో ఉన్నారు.
కిసాన్ మిత్రా చేసిన పని : కిసాన్ మిత్ర కార్యకర్త రైతుల రెవెన్యూ సమస్యల గురించి మైదుకూరు తహషీల్దార్ కార్యాలయంలో దరఖాస్తు చేయడానికి వెళ్లగా, అక్కడ పండుగాయాల బుచ్చయ్య అనే రైతు దీనంగా ఉండడం గమనించి ఆయన సమస్యను తెలుసుకోగా రైతు భరోసా రావడం లేదని చెప్పారు, మేము యం.ఆర్.ఓ దగ్గరికి వెళ్లి రెవెన్యూ డాక్యుమెంట్లు పరిశీలించగా అక్కడ రికార్డులు అన్ని సరిగా ఉన్నాయని తెలిపారు.
- తరువాత ఈ సమస్య గురించి అగ్రికల్చర్ కార్యాలయంలో వ్యవసాయ అధికారి వసంత కుమారి గారి దృష్టికి తీసుకెళ్లగా, వారు పరిశీలించి రైతు భరోసా రావడానికి ప్రయత్నం చేస్తామని చెప్పారు. మళ్ళీ రైతు భరోసా విడుదల చేసినప్పుడు తనిఖీ చేయగా గ్రామ స్థాయిలో తిరస్కరించడం జరిగిందని తెలిపారు.
- ఈ విషయం గురించి అధికారులను అడుగగా మళ్ళీ పై అధికారులకు ఫిర్యాదు చేస్తామని చెప్పారు. కానీ రైతు భరోసా విడుదల చేసినప్పుడు ఈ సారి కూడా అమౌంట్ పడలేదు. కారణం తెలుసుకోగా లబ్ధిదారుని రికార్డుల యందు చనిపోయినట్లు చూపిస్తుంది అని ఇదే విషయాన్ని ఏ.ఓ గారికి తెలుపగా అందుకు వారు గ్రామంలో రెవెన్యూ సహాయకులు చెప్తే, చనిపోయినట్లు ఆన్లైన్ లో నమోదు పొరపాటుగా చేయడం జరిగిందని తెలిపారు.
- చేసేదేమి లేక తిరిగి జిల్లా వ్యవసాయ అధికారి కార్యాలయంలో డిప్యూటీ డైరెక్టర్ అయిన రాధా దేవి మేడం గారి దృష్టికి తీసుకెళ్లగా అప్పుడు వారు ఈ విషయాన్ని కమీషనర్ కార్యాలయానికి ఫోన్ చేసి పొరపాటును సరి చేశారు. తర్వాత పండుగాయాల బుచ్చయ్యకు రైతు భరోసా డబ్బులు రావడం జరిగింది.
- మళ్ళీ ఇలాంటి తప్పులు జరగకూడదు అని, రైతులు ఇబ్బంది పడకూడదు అని డిప్యూటీ డైరెక్టర్ రాధా దేవి మేడం గారు వ్యవసాయ అధికారులకు మౌఖిక ఆదేశాలు ఇచ్చారు.
రైతు పండుగాయల బుచ్చయ్య అబిప్రాయం : రైతు భరోసా డబ్బుల కోసం ఎన్ని సార్లు రైతు భరోసా కేంద్రం, వ్యవసాయ అధికారులు, తహషీల్దార్ కార్యాలయం చుట్టూ తిరిగిన కూడా డబ్బులు రాకపోవడంతో ఇంకా డబ్బులు రావని నిర్ణయానికి వచ్చినప్పుడు కిసాన్ మిత్ర టీం ద్వారా రైతు భరోసా పెండింగ్ సమస్యను పరిష్కరించి నాకు రైతు భరోసా డబ్బులు ఇప్పించినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.