రైతు పేరు : మల్లేపలి పెద్దరామయ్య
గ్రామం :చక్రాయపేట
మండలం : చక్రాయపేట
జిల్లా : YSR కడప
రాష్ట్రం : ఆంధ్రప్రదేశ్
చక్రాయపేట పెద్దరామయ్య (అధిక వర్షాల వలన నష్టపోయిన వరి పంట)
సమస్య : చక్రయపేట గ్రామంలో రైతు పెద్దరామయ్య గారు సర్వే 883/1 లో ఒక ఎకరా విస్తీర్ణంలో 2021 ఖరీఫ్ లో నవార వరిని సాలు పద్ధతి లో సాగు చేయడం జరిగింది.కానీ అధిక వర్షాల వలన పంట మొత్తం నీటిలో మునిగిపోయి పూర్తిగా నష్టపోవడం జరిగింది.కాబట్టి పంట నష్టం కు సంభందించిన ఆర్థిక పరిహారం గురించి కిసాన్ మిత్ర హెల్ప్ లైన్ కు తెలియ చేయడం జరిగింది.
కిసాన్ మిత్ర టీం చేసిన పని : కిసాన్ మిత్ర టీం వెళ్లి చక్రాయపేట రైతు భరోసా కేంద్రంలో VHA శ్రీకాంత్ గారిని కలిసి నవార పంట నష్టం గురించి తెలియజేసి VHA శ్రీకాంత్ గారితో కలిసి రైతు పెద్దరామయ్య గారి నవార పొలంను విజిట్ చేసి నష్ట పోయిన పంట కు సంభందించిన పొలం వివరాలను తీసుకొని ఇన్పుట్ సబ్సిడీ కి సంభందించిన యాప్ లో అప్లోడ్ చేయించడం జరిగింది.ఆ తరువాత వర్షాల వల్ల నష్టపోయిన పంట ఇన్పుట్ సబ్సిడీ 15000/- డబ్బులు రైతు అకౌంట్ లో జమకావడం జరిగింది. ఈ రైతుతో పాటుగా ఇంకో 16 మంది రైతులకు డబ్బులు అకౌంట్ లో జమ కావడం జరిగింది.
రైతు పెద్దరామయ్య గారి స్పందన : 2021 లో కురిసిన అధిక వర్షాల వలన నష్టపోయిన వరి పంటకు సంబంధించిన ఇన్పుట్ సబ్సిడీ రావడానికి సహకరించిన కిసాన్ మిత్ర టీం కు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.