రైతు పేరు : బత్తల నాగయ్య
గ్రామం :నంగనూరు పల్లి
మండలం : ప్రొద్దుటూరు
జిల్లా : YSR కడప
రాష్ట్రం : ఆంధ్రప్రదేశ్
పవన్, జయన్న, నాగప్రసన్న, నాగేంద్ర, నాగయ్య
సమస్య : ప్రొద్దుటూరు మండలం, నంగనూరుపల్లి గ్రామంలో నివాసం వున్న బత్తల రామలక్షుమ్మ(32) భర్త నాగయ్య కుటుంబం వృత్తి రీత్యా వ్యవసాయం మరియు గొర్రెలు మేపుకొని జీవించేవారు. ప్రతి రోజు మాదిరిగానే ఆమె గొర్రెలను మేపుకొనడానికి రిజర్వు ఫారెస్ట్ అయిన రేగుల్లపల్లి గ్రామ శివార్లలో మేపుకొంటుండగా, అక్కడే దగ్గరలో ఉన్న వేరుశనగ పంటకు సమీపంలో గొర్రెలకు మేత ఉన్నందున గొర్రెలు అటు వైపుగా పోవడం జరిగింది. గొర్రెలు ఎక్కడ పంటను తినేస్తాయని గ్రహించి బత్తల రామలక్షుమ్మ తొందరపాటులో అటువైపుగా వెళ్లారు. (రాత్రిపూట పందుల బెడద ఎక్కువగా ఉండటంతో వేరు శనగపంటను రక్షించుకోవడానికి మడక బాబు అనే రైతు రాత్రి పొలం చుట్టూ విద్యుత్తు తీగలను కర్రలను పాతకుండా గెట్టు పైనే వేసి విద్యుత్తు అమర్చారు.
- మడక బాబు అనే రైతు తిరిగి ఉదయం వాటిని తొలగించకుండా మర్చిపోయారు.) విద్యుత్తు తీగలను తొలగించాకపోవటం వల్ల అటు వైపు వెళ్ళిన బత్తల రామలక్షుమ్మకు విద్యుత్ షాక్ తగిలి అక్కడే మరణించింది. తనతో పాటు పాటు 4 గొఱ్ఱెలు, 3 మేకలు, ఒక కుక్క కూడా మరణించాయి. ఎవరైతే ఆ పొలములో సాగు చేస్తున్నారో అతని దగ్గర ఆ పొలానికి సంబంధించి ఎలాంటి రికార్డులు లేకుండా బంజరు భూమి లాగా సాగుచేస్తున్నారు.
- ఈ సంఘటన జరిగిన దగ్గరకు పోలీసులు వచ్చి కేసు నమోదు చేసుకున్నారు మరియు పోస్ట్ మార్టం కూడా పూర్తి అయినది. బత్తల రామలక్షుమ్మ 32(y) H/o నాగయ్య గారికి ఒక కూతురు మరియు కొడుకు ఉన్నారు. వారు నాగ ప్రసన్న (8వతరగతి) ఒక కొడుకు నాగేంద్ర (6వతరగతి) చదువుతున్నారు.
కిసాన్ మిత్రా చేసిన పని : ఈ సమస్య గురించి కిసాన్ మిత్ర దృష్టికి రావడంతో 2021 సెప్టెంబర్ 8వ తేదీ సి.యస్.ఏ- కిసాన్ మిత్ర ఫీల్డ్ టీం మరియు ఇతర సిబ్బంది కలిసి వారి కుటుంబాని కావటం జరిగింది. వారికి రావలసిన సామాజిక భద్రత క్రింద ప్రమాద భీమా గురించి చెప్పడం జరిగింది.
- బత్తల నాగయ్య గారు రెండు వారాలు పాటు బ్యాంకుల చుట్టూ రోజూ కూలి పని మానేసి తిరిగాడు. కానీ బ్యాంకు అధికారులు మీకు ఏవిధమైన పరిహారం రాదు అని చెప్పారు. కిసాన్ మిత్ర ఫీల్డ్ టీం వారి యొక్క బ్యాంక్ స్టేట్ మెంట్ పరిశీలించి చూడగా బత్తల రామ లక్షుమ్మ గారికి మే నెలలో PMSBY స్కీం రెన్యూవల్ చేసినట్లు ఉంది.
- ఈ విషయం గురించి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ప్రొద్దుటూరు శాఖ అధికారులను కిసాన్ మిత్ర టీం మరియు ఇతర సిబ్బంది సంప్రదించి, వారితో ప్రధానమంత్రి సురక్ష భీమా యోజన గురించి చర్చించగా అందుకు బ్యాంకు అధికారులు భీమాకు సంబంధించిన పత్రాలు మాకు అందజేసిన వారికి ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేస్తామని చెప్పారు.
- తరువాత రైతు అన్ని పత్రాలను బ్యాంకు అధికారికి అందజేయటం జరిగింది. కొన్ని రోజుల తరువాత బత్తల నాగయ్య గారి సేవింగ్స్ బ్యాంక్ ఖాతాలో ఒక లక్షా ఎనభై వేలు రూపాయలు జమ అయినవి. మిగిలిన 20000/- GST పోను రైతు అకౌంట్ లో జమ అవుతాయని చెప్పారు.
- ఈ డబ్బులే కాకా ఇంకా స్థానిక MLA శ్రీ రాచమల్లు శివప్రసాద్ రెడ్డి గారు తన స్వంత నిధులను 2 లక్షలు ఇచ్చారని చెప్పారు.
రైతు భర్త నాగయ్య గారి అభిప్రాయం : కిసాన్ మిత్ర హెల్ప్ లైన్ కి 2021 సెప్టెంబర్ 2వ తేది న ఫోన్ చేయటం ద్వారా సమస్యను పరిష్కరించటంలో సి.యస్.ఏ-కిసాన్ మిత్ర టీం ఇతర సిబ్బంది పూర్తి సహాయ సహకారాలు అందించి ఎక్సగ్రెసియా వచ్చేలా కృషి చేసారు, వారికీ ధన్యవాదాలు…