.
రైతు పేరు : బేరి నీహారిక
గ్రామం :అడవిచెర్లోపల్లి
మండలం : వీరపునాయినిపల్లి
జిల్లా : YSR కడప
రాష్ట్రం : ఆంధ్రప్రదేశ్
నిహారిక కుటుంబము తో కిసాన్ మిత్ర టీం జయన్న, నిహారిక మరియు వారి కొడుకు అక్షయ్, భాస్కర్ మరియు నరేష్
సమస్య : వీరపునాయినిపల్లి మండలం, అడవిచెర్లోపల్లి గ్రామంలోని బేరి గంగన్న అనే రైతు తనకు ఉన్న 3.6 ఎకరాల భూమిలో కంది, వేరుశనగ, ఉల్లి పంటలు సాగు చేసి వ్యవసాయం చేస్తూ ఉండేవారు వరుసగా నాలుగు సంవత్సరాల నుండి పంటలల్లో నష్టం వచ్చి దాదాపు 5 లక్షలు అప్పులు కావడంతో ఈ అప్పులు తీర్చడానికి గొర్రెలు తెచ్చుకొని మేపుకుంటు జీవనం సాగిస్తూ వుండగా 2020లో వచ్చిన అధిక వర్షాల వల్ల గోర్రెలకు గాలికుంటు వ్యాధి సోకి ఎక్కువ మొత్తంలో చనిపోవడంతో నష్టాలు వచ్చి కుటుంబ పోషణ కూడా కష్టంగా మారింది.
- అప్పుల మొత్తం 7 లక్షలకు చేరడంతో తీవ్రంగా మనస్తాపం చెంది 05/06/2021న తెల్లవారు జామున 4.30 గం,లకు ఇంటి పక్కన వున్న చెట్టుకు డ్రిప్ పైపుతో ఊరి వేసుకొని ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. ఈ సంఘటన జరిగిన వెంటనే పోలీసులు వచ్చి కేసు నమోదు చేసినారు. కానీ రెవిన్యూ, అగ్రికల్చర్ నుండి ఎలాంటి అధికారి రాలేదు. ఈ రైతుకు బార్య నీహారిక (35), కుమారులు అభినయ్ (12), అక్షయ్ కుమార్ (6)లు ఉన్నారు.
- ప్రభుత్వం నుండి ఆర్థిక సహకారం అందించి మా కుటుంబాన్ని ఆదుకోమని రెవిన్యూ, అగ్రికల్చర్ కార్యాలయాల చుట్టూ తిరిగిన ఏ అధికారి స్పందించక పోవడంతో 3 నెలల తరువాత గ్రామస్తుల ద్వారా సుస్థిర వ్యవసాయ కేంద్రం కిసాన్ మిత్ర హెల్ప్ లైన్ గురించి తెలియడంతో సెప్టెంబర్ 28 న కిసాన్ మిత్ర హెల్ప్ లైన్ కు కాల్ చేయడం జరిగింది.
కిసాన్ మిత్రా చేసిన పని : నీహారిక గారు సుస్థిర వ్యవసాయ కేంద్రం కిసాన్ మిత్ర హెల్ప్ లైన్ కి కాల్ చేయడంతో కిసాన్ మిత్ర టీం ముందుగా ఆత్మహత్య చేసుకున్న రైతు బేరీ గంగన్న భార్య అయిన నీహారిక గారిని కలవటం, తన భర్త చనిపోవటానికి గల కారణాలు తెలుసుకొని, పూర్తి వివరాలు సేకరించటం జరిగింది. తరువాత వీరపునాయినిపల్లి అగ్రికల్చర్ ఆఫీసర్ శ్యామ్ బాబు సార్ గారిని కలిసి ఈ రైతు ఆత్మహత్య చేసుకున్నకుటుంబనికి ఎక్సగ్రెసియా పెండింగ్ సమస్యను వివరించటం జరిగింది.
- ఈ రైతు ఆత్మహత్య సమస్య గురించి మా దృష్టికి రాలేదు కాబట్టి గ్రామ రెవిన్యూ అధికారి నుండి గ్రామ ప్రాథమిక సమాచారం కావాలని చెప్పడంతో మండల రేవున్యు అధికారి మాధవి మేడం గారిని గ్రామ రెవిన్యూ అధికారి ప్రభాకర్ రెడ్డి సార్ గారిని కలిసి ఈ రైతు ఆత్మహత్య కుటుంబ సమస్యను తెలియజేయడం జరిగింది.గ్రామస్తులను విచారించి వారం లోపల వి.అర్. ఓ మరియు ఆర్. ఐ గారు ఫీల్డ్ ఇన్స్ఫెక్షన్ రిపోర్ట్ ఇవ్వడం జరిగింది.దీనిని మండల ఏ. ఓ శ్యామ్ బాబు సార్ గారికి ఇవ్వగా ప్రైమరీ రిపోర్ట్ మరియు మండల 3 మేన్ కమిటీ రిపోర్ట్ ప్రిపేర్ చేయడం జరిగింది.
- ఈ రిపోర్ట్స్ పైన యస్.ఐ.వీరాంజనేయుులు రెడ్డి గారు, యం.అర్. ఓ.మాధవి గారు మరియు ఏ. ఓ.శ్యామ్ బాబు గారితో సైన్ చేయించి అగ్రికల్చర్ అసిస్టెంట్ డైరెక్టర్ నరసింహారెడ్డి గారికి మరియు కడప జిల్లా అగ్రికల్చర్ ఆఫీస్ లో రైతు ఆత్మహత్య విభాగం లోని కవిత మేడం గారికి ఇవ్వడం జరిగింది. తరువాత డివిజనల్ 3 మేన్ కమిటీ రిపోర్ట్ ప్రిపేర్ చేయించి ఫాలో అప్ చేయడం జరిగింది. ఈ కుటుంబానికి 2022 ఏప్రిల్ 6 న ఇ ఎఫ్.యం.యస్ ద్వారా నీహారిక గారి అకౌంట్ లో 7 లక్షలు జమకావడం జరిగింది.
రైతు భార్య నీహారిక అబిప్రాయం : కిసాన్ మిత్ర హెల్ప్ లైన్ కి ఫోన్ చేయటం ద్వారా సమస్యను పరిష్కరించటంలో కిసాన్ మిత్ర టీం పూర్తి సహాయ సహకారాలు అందించి ఎక్సగ్రెసియా వచ్చేలా కృషి చేసారు, ఆ డబ్బులతో కొంత అప్పు లు తీర్చుకొని కొంత మొత్తం పిల్లల పేరుతో డిపాజిట్ చేయడం జరిగింది.కిసాన్ మిత్ర లేకుంటే మాకు ప్రభుత్వం నుండి రావలసిన ఆర్థిక పరిహారం వచ్చేది కాదు కాబట్టి సుస్థిర వ్యవసాయ కేంద్రం కిసాన్ మిత్ర కు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.