రైతు పేరు. : లంక మాదవి
గ్రామం : బ్రహ్మంగారిమఠం
మండలం : బ్రహ్మంగారిమఠం
జిల్లా. : వై.యస్.ఆర్.కడప
రాష్ట్రం : ఆంధ్రప్రదేశ్
సమస్య : కిసాన్ మిత్ర హెల్ప్ లైన్ కార్యకర్తలు బ్రహ్మంగారిమఠం మండలం బ్రహ్మంగారిమఠం గ్రామంలో రైతులకు ఉపయోగపడే ప్రభుత్వ పథకాల గురించి అవగాహన కార్యక్రమాలు చేస్తున్న క్రమంలో లంక మాదవి గారికి పంట రుణం కావాలి అని అడగడం జరిగింది.
- తను చాలా సార్లు స్టేట్ బ్యాంకు అఫ్ ఇండియా, బ్రహ్మంగారిమఠం బ్రాంచ్ లో లోన్ గురించి అడగడం జరిగింది కానీ సానుకూల స్పందన రాలేదు అని తర్వాత తాను లోన్ గురించి ఏ బ్యాంకులో అడగలేదు అని చెప్పారు.
కిసాన్ మిత్రా చేసిన పని : లంక మాధవి గారికి పంట రుణం కోసం ఆమె గ్రామానికి దగ్గర ఉన్న బ్యాంకు అధికారులతో మాట్లాడితే లంక మాదవి గారికి మా బ్యాంకులో అకౌంట్ లేదు అని చెప్పారు, ఇప్పుడు బ్యాంకు ఖాతా ఓపెన్ చేయవచ్చా అని బ్యాంకు అధికారిని అడిగితే కొన్ని రోజుల తరువాత రమ్మని చెప్పారు. తర్వాత మైదుకూరు స్టేట్ బ్యాంకు లో కొత్త బ్యాంకు అకౌంట్ ఓపెన్ చేయించి 95000/- పంట రుణం మంజూరు చేయించడం జరిగింది.
లంక మాధవి అబిప్రాయం : మైదుకూరు స్టేట్ బ్యాంక్ లో కొత్త అకౌంట్ ఓపెన్ చేయడం మరియు క్రాప్ లోన్ వచ్చేలా చేయటంలో కిసాన్ మిత్ర కార్యకర్తలు సహాయం చేయకపోతే నాకు ఈ క్రాప్ లోన్ వచ్చి ఉండకపోవచ్చు అని రైతు చెప్పారు. 95000/- పంట ఋణం మంజూరు కావడం వల్ల ఈ అమౌంట్ వ్యవసాయ సాగు పెట్టుబడికి ఉపయోగకరంగా ఉంటుంది అని, నాకు సహాయం చేసినందుకు కిసాన్ మిత్ర కార్యకర్తలకు ప్రత్యేక ధన్యవాదాలు అని లంక మాధవి చెప్పారు.