రైతు పేరు : యాడికి నాగలక్ష్మి
గ్రామం : ఇప్పట్ల
మండలం : లింగాల
జిల్లా : YSR కడప
రాష్ట్రం : ఆంధ్రప్రదేశ్
సమస్య :- లింగాల మండలం, ఇప్పట్ల గ్రామంలోని యాడికి ఆనంద్ రెడ్డి అనే రైతు, తనకు ఉన్న 3 ఎకరాల భూమిలో అరటి సాగు చేసి వ్యవసాయం చేస్తూ ఉండేవారు.
- అరటి పంట సాగుకు నీళ్లు సరిపోక పోవడంతో అప్పులు చేసి బోర్లు వేయడం జరిగింది. బోర్లు వేసిన వాటిలో కొద్దిపాటి నీళ్లు రావటంతో అరటి సాగు చేస్తూ పులివెందులలో నివాసం ఉంటూ, బోర్ మోటార్లు రిపేరు చేస్తూ వుండేవారు. ఈ క్రమంలో తీసుకున్నఅప్పులకు వడ్డీలు ఎక్కువైతాయని, తొందరగా తీర్చాలని సొంత పొలంతో పాటు 3 ఎకరాలు అదనంగా కౌలుకు తీసుకొని బూడిద గుమ్మడి సాగు చేసినారు.
- మొదట్లో పంట ఆశాజనకంగా ఉందనిపించింది కానీ కాయలు పగుళ్లు ఏర్పడి మార్కెట్లో గిట్టుబాటు ధరలేక పోవడంతో పొలాన్ని చూసి మనస్తాపం చెంది పొలంలోనే పురుగుమందు తాగి 2019 మార్చి 5వ తేదిన ఆత్మహత్య చేసుకున్నారు. ఈ రైతుకు భార్య నాగలక్ష్మి (34), కుమార్తెలు అభినయ(8), ఆరాధ్య (6) అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు.
- యాడికి ఆనందరెడ్డి ఆత్మహత్య చేసుకున్నప్పుడు పోలీస్ మరియు ఇతర అధికార్లు కూడా వచ్చి చూసారు. రైతు భార్య నాగలక్ష్మి భర్త చనిపోవటంతో ఇంట్లోనే బట్టలు కుట్టుతూ పిల్లలను పోషించుకుంటూ జీవనం సాగిస్తున్నారు. తనకు రావలిసిన ఎక్సగ్రెసియా గురించి మండల రెవిన్యూ అధికారి దగ్గర దరఖాస్తు కూడా చేసుకుంది. తన భర్త ఆత్మహత్యకు సంబంధించి ఎఫ్.ఐ.ఆర్ మరియు పోస్టుమార్టం రిపోర్ట్ మరియు ఇతర డాక్యుమెంట్లు అన్ని అధికారులకు సంపర్పించి ఉన్నప్పటికీ వారికి రావలసిన ఎక్సగ్రెసియా పెండింగులోనే ఉంది.
- నాగలక్ష్మి గారు వారు ఎక్సగ్రెసియా పెండింగ్ గురించి లింగాల తహశీల్దార్ మరియు వ్యవసాయ అధికారి కార్యాలయం వెళ్లగా వారు మీ భూమి లింగాల మండలంలో ఉన్నప్పటికీ, మీ కుటుంబం నివాసం ఉండేది పులివెందులలో కాబట్టి పులివేందులకు వెళ్ళమని చెప్పారు,
- పులివేందుల అధికారులను కలిసి అడుగగా వారు లింగాల మండల అడికరులే రిపోర్ట్ వ్రాయాలని చెప్పి ఒకరిపైనా ఒకరు చెప్పుకుంటూ ఈ సమస్యను పక్కన పెట్టేయడంతో, అధికారుల చుట్టూ తిరిగి తిరిగి ఇంకా రాదని నిరాశతో ఉండిపోయింది.
కిసాన్ మిత్రా చేసిన పని : నాగ లక్ష్మి గారికి సుస్థిర వ్యవసాయ కేంద్రం (సియస్.ఏ.)కిసాన్ మిత్ర ద్వారా చేస్తున్నపనుల గురించి తెలియడంతో 2020 డిసెంబర్ 2వ తేదిన సి.యస్.ఏ. కిసాన్ మిత్ర హెల్ప్ లైన్ కి కాల్ చేయడంతో కిసాన్ మిత్ర టీం ముందుగా ఆత్మహత్య చేసుకున్న యాడికి ఆనందరెడ్డి భార్య అయిన నాగలక్ష్మి గారిని కలవటం, తన భర్త చనిపోవటానికి గల కారణాలు తెలుసుకొని, పూర్తి వివరాలు సేకరించటం జరిగింది.
- తరువాత పులివేందుల అగ్రికల్చర్ AD రమణారెడ్డి సార్ గారిని కలిసి ఈ రైతు ఆత్మహత్య చేసుకున్నకుటుంబనికి ఎక్సగ్రెసియా పెండింగ్ సమస్యను వివరించటం జరిగింది. వారు కుటుంబనికి ఎక్సగ్రెసియా వచ్చేలా చూస్తామని చెప్పారు. కానీ ఎక్కడ సమస్య పరిష్కారం కాకపోవటంతో తరువాత 2021 ఏప్రిల్ 16వ తేదిన సియస్.ఏ-కిసాన్ మిత్ర ఫీల్డ్ కోఆర్డినేటర్ మరియు రైతు భార్య నాగలక్ష్మి ఇద్దరు కలిసి పులివేందుల PADA OSD శ్రీ అనిల్ కుమార్ సార్ గారిని కలిసి, 2019లో యాడికి ఆనందరెడ్డి అనే రైతు ఆత్మహత్య చేసుకుంటే ఇంతవరకు ఆ కుటుంబానికి ఎలాంటి పరిహారం అందలేదని విషయాన్ని వివరించడం జరిగింది.
- శ్రీ అనిల్ కుమార్ గారు అగ్రికల్చర్ AD రమణారెడ్డి గారితో మరియు పులివేందుల మండల అధికారులతో మాట్లాడడంతో, మండల స్థాయి రిపోర్ట్ మరియు డివిజనల్ స్థాయి రిపోర్ట్ పూర్తి కావటంతో, కడప జిల్లా అగ్రికల్చర్ కార్యాలయంలో అడ్వాన్స్ స్టాంప్ రసీదు కూడా ఇవ్వడం జరిగింది. ఎన్నికల కోడ్ ముగిసిన వెంటనే ఈ కుటుంబానికి EFMS ద్వారా అకౌంట్ లో 7 లక్షల డబ్బులు జమ అవుతాయి…
రైతు భార్య నాగలక్ష్మి అబిప్రాయం: కిసాన్ మిత్ర హెల్ప్ లైన్ కి ఫోన్ చేయటం ద్వారా సమస్యను పరిష్కరించటంలో కిసాన్ మిత్ర టీం పూర్తి సహాయ సహకారాలు అందించి ఎక్సగ్రెసియా వచ్చేలా కృషి చేసారు, వారికీ ధన్యవాదాలు…