రైతు పేరు : కమ్మినేని గీతాంజలి
గ్రామం :సుద్ధలవాండ్లపల్లి (నారాయణరెడ్డిపల్లి GP)
మండలం : సంబేపల్లి
జిల్లా : YSR కడప
రాష్ట్రం : ఆంధ్రప్రదేశ్
సమస్య : సంబేపల్లి మండలంలోని సుద్ధలవాండ్లపల్లి గ్రామానికి చెందిన మహిళ రైతు కమ్మినేని గీతాంజలి కుటుంబం వ్యవసాయం పై ఆధారపడి జీవనం సాగిస్తూవుండే వారు, అనుకోకుండా భర్త నరసింహ గారు కోవిడ్ తో ఆగస్ట్ 8, 2021 న మరణించారు. వీరికి ఇద్దరు కుమారులు ఒకరు మురళి(16), కుషల్(15) వున్నారు.
- అప్పటికే సంవత్సరంలోపే గీతాంజలి మామగారు అనారోగ్యంతో మరణించారు, తరువాత భర్త నరసింహ కోవిడ్ తో తిరుపతి రమాదేవి హాస్పిటల్ మరణించారు. నరసింహ తల్లి గారు కొడుకు మరణ వార్త విని జీర్ణించుకోలేక మరుసటి రోజే చనిపోవడం జరిగింది. ఈ విధంగా ఒక సంవత్సరంలోపే కుటుంబంలో ముగ్గురు మరణించడంతో మరియు వైద్య ఖర్చులకు అయిన అప్పులు కూడా ఎక్కువగా కావడంతో గీతాంజలి గారు మానసికంగా కృంగిపోవడం జరిగింది.
- అయినప్పటికీ ప్రభుత్వం నుండి ఈ కుటుంబానికి ఎలాంటి ఆర్థిక పరిహారం అందకపోవడం మరియు ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన(PMJJY) ద్వారా రావలసిన భీమా గురించి SBI బ్యాంక్ కు వెళ్లగా మేనేజర్ భాను సార్ గారు భీమా గురించి మాకు ఎలాంటి గైడ్ లైన్స్ రాలేదని చెప్పడంతో బ్యాంక్ చుట్టూ తిరిగి విసుగు చెందిన వారు సుస్థిర వ్యవసాయ కేంద్రం కిసాన్ మిత్ర హెల్ప్ లైన్ గురించి తెలుసుకొని హెల్ప్ లైన్ కు కాల్ చేయడం జరిగింది.
కిసాన్ మిత్ర చేసిన పని : కిసాన్ మిత్ర టీం గీతంజాలి సమస్యను తెలుసుకొని, ఆమెకు ధైర్యాన్ని చెప్పటం జరిగింది, అలాగే మానసికంగా ఇబ్బంది పడుతుంటే వందన గారితో కౌన్సిలింగ్ ఇప్పించడం జరిగింది.
- తరువాత వారి కుటుంబానికి రావలసిన PMJJBY ఇన్సూరెన్స్ గురించి జనవరి 4, 2022 న సంబేపల్లి స్టేట్ బ్యాంక్ మేనేజర్ భాను సార్ ని కలిసి సుస్థిర వ్యవసాయ కేంద్రం కిసాన్ మిత్ర హెల్ప్ లైన్ గురించి మరియు హెల్ప్ లైన్ ద్వారా రైతులకు అందిస్తున్న సేవా కార్యక్రమాల గురించి తెలియజేసి, PMJJBY పథకం ద్వారా ఎలాంటి మరణం అయిన కూడా బీమా వర్తిస్తుంది, కాబట్టి గీతంజాలి కుటుంబానికి రావలసిన భీమా చెల్లించమని కోరడం జరిగింది.
- అందుకు కావలసిన 330/- రూ, లు ప్రీమియం కట్టిన సర్టిఫికెట్ ఆఫ్ ఇన్సూరెన్స్, డెత్ సమ్మరీ, డెత్ సర్టిఫికెట్ ,ఫ్యామిలీ సర్టిఫికెట్, భార్య, భర్త ఆధార్ మరియు బ్యాంక్ అకౌంట్ లు ఇవ్వగా వాటిని పరిశీలించిన తరువాత కడప లోని SBI Life Insurance ఆఫీస్ లో ఇన్సూరెన్స్ క్లెయిమ్ అప్లికేషన్ తీసుకరామని చెప్పారు.
- 5 జనవరి 2022 వ తేదీన కడపలో SBI Life Insurance కు వెళ్లి అప్లికేషన్ తీసుకొని 6 జనవరి 2022 న సంబేపల్లి స్టేట్ బ్యాంక్ కు వెళ్లి అప్లికేషన్ పైన మేనేజర్ గారి సంతకం తీసుకొని మరియు అందుకు సంబంధించిన డ్యాక్యూమెంట్లు తీసుకొని గీతాంజలి గారితో పాటుగా కడప లోని SBI Insurance ఆఫీస్ లో ఇవ్వడం జరిగింది. తర్వాత జనవరి 18 వ తేదీన గీతాంజలి గారి అకౌంట్లో 2 లక్షల రూపాయలు జమ కావడం జరిగింది.
గీతాంజలి గారి అభిప్రాయం : సుస్థిర వ్యవసాయ కేంద్రం కిసాన్ మిత్ర హెల్ప్ లైన్ కు కాల్ చేయడం ద్వారా నాకు మానసికంగా ధైర్యాన్ని చెప్పి, అన్ని వేళల అండగా ఉన్నారు మరియు ప్రభుత్వం నుండి కానీ ఎలాంటి ఆర్థిక పరిహారం రాక నిరాశ తో ఉన్న నాకు కిసాన్ మిత్ర టీం వారు బ్యాంక్ మేనేజర్ మరియు లైఫ్ ఇన్సూరెన్స్ వారితో మాట్లాడి నాకు 2 లక్షల భీమా మంజూరు చేయించారు. ఈ డబ్బుతో మా కుటుంబానికి ఉన్న అప్పులన్ని తీర్చి ప్రస్తుతం ప్రశాంతమైన జీవితం సాగిస్తున్నాము. ఈ విధంగా మా కుటుంబానికి సహకరించిన సుస్థిర వ్యవసాయ కేంద్రం కిసాన్ మిత్ర టీం కు ప్రత్యేక ధన్యవాదాలు.