రైతు పేరు      : కొవ్వూరు పెద్దసుబ్బయ్య
గ్రామం          : చక్రాయపేట
మండలం.     : చక్రాయపేట
జిల్లా.           : వై.యస్.ఆర్.కడప
రాష్ట్రం :  ఆంధ్రప్రదేశ్ 

 

 

 

రైతు కొవ్వూరు పెద్ద సుబ్బయ్య      రైతు భరోసా  కేంద్రంలో

సమస్య :  చక్రాయపేట మండలంలో చక్రాయపేట గ్రామంలో రైతు పెద్ద సుబ్బయ్య గారు తనకున్న 2 ఎకరాల పొలంలో గత 7 సంవత్సరాల నుండి  నిమ్మ చెట్లు సాగు చేయడం జరిగింది. నిమ్మ చెట్లు కాపుకు వచ్చినప్పటి నుండి నిమ్మకాయల ప్యాకింగ్ మరియు నిల్వ చేయడంలో చాలా ఇబ్బందులు ఎదుర్కోవడం జరిగింది, 

  • అందువలన హార్టికల్చర్ డిపార్ట్మెంట్ నుండి ప్యాక్ హౌస్ మంజూరు అయింది, కానీ ప్యాక్ హౌస్ నిర్మాణం పూర్తి అయ్యి సంవత్సరం అయిన కూడా బిల్లులు రాకపోవడంతో పెండింగ్ బిల్లు గురించి కిసాన్ మిత్ర హెల్ప్ లైన్ కు కాల్ చేయడం జరిగింది.

కిసాన్ మిత్ర టీం చేసిన పని : చక్రాయపేట పేటలోని కొవ్వూరు పెద్ద సుబ్బయ్య గారి ప్యాక్ హౌస్ పెండింగ్ బిల్లు గురించి మొదట రైతు భరోసా కేంద్రంలోని VHA శ్రీకాంత గారిని కలిసి 4 అక్టోబర్ 2021 లో ప్యాక్ హౌస్ ను విజిట్ చేయడం జరిగింది. ప్యాక్ హౌస్ పూర్తి నిర్మాణం 2020 జూన్ లొనే పూర్తి కావడం జరిగింది కానీ బిల్లు పెండింగ్ ఉంది.

  • ఈ సమస్య గురించి హార్టికల్చర్ ఆఫీసర్ మల్లేశ్వర్ రెడ్డి  సార్ గారితో మాట్లాడడం జరిగింది.24/12/2021 న కడప జిల్లా హార్టికల్చర్ డిప్యూటీ డైరెక్టర్ వజ్రశ్రీ మేడం గారిని కలిసి సమస్యను వివరించడం జరిగింది.తరువాత జనవరి నెల 10 వ తేదీన ప్యాక్ హౌస్ బిల్లు 2 లక్షల రూపాయలు రైతు అకౌంట్ లో జమ కావడం జరిగింది. ఈ రైతుతో పాటుగా ఇంకో  4 మంది రైతులకు 2 లక్షల రూపాయల అకౌంట్ లో జమ కావడం జరిగింది.

రైతు పెద్దసుబ్బయ్య గారి కుమారుడు చంద్ర గారి స్పందన : సంవత్సరం నుండి పెండింగ్ లో ఉన్న ప్యాక్ హౌస్ బిల్లు పెండింగ్ గురించి సుస్థిర వ్యవసాయ కేంద్రం కిసాన్ మిత్ర హెల్ప్ లైన్ ద్వారా పరిష్కరించి 2 లక్షల డబ్బులు త్వరగా అకౌంట్ లో జమ కావడానికి కృషి చేసిన కిసాన్ మిత్ర టీం కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.