రైతు పేరు.     :  గుండుబోయిన గంగయ్య
గ్రామం.         : టి.వెలమవారిపల్లి
మండలం.     : వేంపల్లి
జిల్లా.           : వై.యస్.ఆర్.కడప
రాష్ట్రం :  ఆంధ్రప్రదేశ్ 
 

సమస్య : వేంపల్లి మండలం టి.వెలమవారిపల్లి లోని రైతు గుండుబోయిన గంగయ్య గారు సర్వే నెం- 909/2 లో 3.25 ఎకరాల భూమిలో 1.25 ఎకరాలలో 2020 ఖరీఫ్ లో పత్తి సాగుచేసినారు.ఆ సంవత్సరంలో వచ్చిన నివార్ తుఫాన్ వలన పంట మొత్తం దెబ్బతిని నష్టం రావడం జరిగింది. పంట భీమాకు సంబంధించిన ప్రీమియం 1/- రూపాయి కూడా చెల్లించారు కానీ పంట భీమా రాకపోవడంతో కిసాన్ మిత్ర హెల్ప్ లైన్ కు కాల్ చేయడం జరిగింది.

కిసాన్ మిత్ర టీం చేసిన పని : గుండుబోయిన గబగయ్య గారి సమస్య గురించి సుస్థిర వ్యవసాయ కేంద్రం కిసాన్ మిత్ర హెల్ప్ లైన్ టీం తెలుసుకొని టి.వెలమవారిపల్లి లోని రైతు భరోసా కేంద్రంలోని అగ్రికల్చర్ అసిస్టెంట్ సురేఖ గారిని కలిసి సమస్యను తెలపగా పంటల భీమా పెండింగ్ ఉన్న రైతుల వివరాలు మండల అగ్రికల్చర్ ఆఫీస్ కు పంపించాము,  కానీ ఇంకా రాలేదని తెలిపినారు.

  • తరువాత రైతు దగ్గర నుండి పంట భీమా కు ప్రీమియం 1/- రూ, కట్టిన బ్యాంక్ స్టేట్మెంట్, ఆధార్, భూమి పాసుబుక్, బ్యాంక్ అకౌంట్ తీసుకొని మండల అగ్రికల్చర్ అధికారి లావణ్య మేడం గారిని కలిసి AO లాగిన్ లో అప్లోడ్ చేయించి, కడప భీమా విభాగం కు పంపించడం జరిగింది. తరువాత కడప జిల్లా అగ్రికల్చర్ జెడి సార్ కార్యాలయం కు వెళ్లి నివార్ తుఫాన్ లో నష్టపోయిన పంట నష్టం కు సంబంధించిన భీమా గురించి తెలియజేసి తరువాత పంటల బీమా విభాగం లోని విజయ్ కుమార్ సార్ గారికి కూడా రైతు కు సంబంధించిన డాక్యూమెంట్లు ఇవ్వడం జరిగింది.
  • మార్చి 6 2021 న ఈ రైతుకు 27625/- రూపాయల  పత్తి పంట భీమా బ్యాంక్ అకౌంట్ లో జమకావడం జరిగింది. ఈ రైతుతో పాటుగా ఇంకో  12 మంది రైతులకు కూడా పత్తి పంట భీమా బ్యాంక్ అకౌంట్ లో జమకావడం జరిగింది.

గంగయ్య గారి స్పందన : నివార్ తుఫాన్ లో నష్టపోయిన పత్తి పంట భీమా పెండింగ్ సమస్యను కిసాన్ మిత్ర టీం ద్వారా పరిష్కరించి 27625/- పంట భీమా వచ్చునట్లుగా సహకారం అందించినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.