రైతు పేరు : గొల్లపల్లి రామపుల్లయ్య
గ్రామం : తిప్పనపల్లి
మండలం : బద్వేలు
జిల్లా  : వై.యస్. ఆర్ కడప
రాష్ట్రం :  ఆంధ్రప్రదేశ్ 
తిప్పనపల్లి గ్రామ SC రైతులు                   ఆదినారాయణ , JDA మురళీకృష్ణ,                  జిల్లా అగ్రికల్చర్ కార్యాలయంలో జయన్న, భాస్కర్ మరియు 
                                                                                                                                                             AO సురేష్ రెడ్డి మరియు తిప్పనపల్లి గ్రామ రైతులు… 

సమస్య : బద్వేలు మండలంలోని తిప్పనపల్లి గ్రామంలో CSA- కిసాన్ మిత్ర హెల్ప్ లైన్ గురించి రైతులకు రైతు భరోసా మరియు ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి గురించి అవగాహన కల్పించడానికి వెళ్లడం జరిగింది. ఆ గ్రామంలో రైతులకు రైతు భరోసా గురించి అవగాహన కల్పించగా,  అక్కడ DKTభూములు సాగుచేసుకుంటున్నSC రైతులకు రైతుభరోసా నిధి రావటం లేదు అని తెలిసింది మరియు  స్థానిక గ్రామ నాయకులు SC రైతులకు రైతుబరోసా  రాకుండా అడ్డుకుంటున్నారని కూడా తెలిసింది. ఈ విషయం గురించి CSAకిసాన్ మిత్ర హెల్ప్ లైన్ కు 12/11/2021 వతేదీనా  గొల్లపల్లి రామ పుల్లయ్య మరియు ఇతరు రైతులు ఫోన్ చేసి సమస్యను తెలిపారు.

  • అక్కడ ఉన్న చాలామంది SC రైతులకు రైతుబరోసా  రావటం లేదు. ఈ విషయం గురించి తిప్పనపల్లి గ్రామ సచివాలయంలో అగ్రికల్చర్ అసిస్టెంట్ సందీప్ గారిని వివరణ కోరగా గ్రీవెన్స్ చేశాము కానీ మండలం లెవెల్ లో రిజెక్ట్ అయినవి అని తెలిపారు. తర్వాత మండల అగ్రికల్చర్ అధికారి ప్రసాద్ రెడ్డి గారిని కలసి సమస్యను వివరించడం జరిగింది. కానీ వారు ఈ విషయాన్ని జిల్లా దృష్టికి తీసుకెళ్లాలని సూచించారు.
  • తర్వాత బద్వేలు తహశీల్దార్ గారిని కలిసి సమస్యను వివరించగా బద్వేలు మండలంలో DKTభూములకు సంబంధించి దాదాపు 2000 మందికి రావలసిన అవసరం ఎంతైనా ఉందని తెలిపారు. వారు కూడా జిల్లా అధికారుల దృష్టికి తీసుకెళ్లాలని సూచించారు.

కిసాన్ మిత్రా చేసిన పని : ఈ సమస్య గురించి సుస్థిర వ్యవసాయ కేంద్రం – కిసాన్ మిత్ర టీం మరియు ఇతర సిబ్బంది మరియు తిప్పనపల్లి గ్రామ SCరైతులు అందరూ కలసి జిల్లాలోని జాయింట్ డైరెక్టర్ ఆఫ్ అగ్రికల్చర్ అధికారి అయిన శ్రీ మురళీ కృష్ణ గారిని కలసి రైతుభరోసా సమస్యను వారి దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. అందుకు వారు సానుకూలంగా స్పందించి అప్పటికప్పుడే ఆ రైతుల వివరాలును బద్వేలు మండలము లోని అగ్రికల్చర్ అధికారి గారికి మెయిల్ ద్వారా రైతుల వివరాలు పంపి పరిష్కరించాలని ఆదేశించారు.

  • తర్వాత  ఒక్కొక్కరికి 7500 చొప్పున  11 మంది రైతులకు వారి అకౌంట్ లో  రైతు భరోసా డబ్బులు జమ కావడం జరిగింది. ఆ తర్వాత గ్రామంలో రైతు భరోసా డబ్బులు రాని రైతులు కూడా అందరూ రైతుభరోసా కోసం గ్రీవెన్స్ చేసుకోవడం ద్వారా ప్రభుత్వం ఇచ్చే రైతు భరోసా పెట్టుబడి నిధిని పొందడం జరిగింది.

తిప్పనపల్లి గ్రామ SC రైతుల అభిప్రాయం : కిసాన్ మిత్ర హెల్ప్ లైన్ కు 2020 నవంబర్ 12వ తేదిన కాల్ చేయడం ద్వారా సంవత్సరం నుండి పెండింగ్ లో ఉన్న రైతు భరోసా సమస్యను పరిష్కరించి,  7500/- రైతు భరోసా డబ్బులు ఒకే సారి వచ్చేటట్లు సహకరించిన సుస్థిర వ్యవసాయ కేంద్రం -కిసాన్ మిత్ర టీం కు రైతులే స్వయంగా కిసాన్ మిత్ర హెల్ప్ లైన్ కి కాల్ చేసి ధన్యవాదాలు చెప్పడం జరిగింది.