రైతు పేరు : టంగుటూరు ప్రమీలమ్మ
గ్రామం  :కల్లూరు
మండలం  :  ప్రొద్దుటూరు
జిల్లా   : YSR కడప
రాష్ట్రం : ఆంధ్రప్రదేశ్
 

 

సమస్య : ప్రొద్దుటూరు మండలంలోని కల్లూరు  గ్రామానికి చెందిన టంగుటూరు ప్రమీలమ్మ గారి భర్త మరణానంతరం, తన భర్త పేరు మీద ఉన్న భూమిని తన పేరు మీదకు భూమి బదలాయింపు చేసుకోవడానికి ప్రొద్దుటూరు మీసేవ కేంద్రంలో మరియు తహశీల్దార్ కార్యాలయంలో దరఖాస్తు చేసినప్పుడల్లా అధికారులు ఈమె దరఖాస్తును తిరస్కరించేవారు. ఈమె దరఖాస్తును తిరస్కరించడానికి ఆమె బంధువులు కూడా  ఒక కారణం అని చెప్పింది.

కిసాన్ మిత్రా చేసిన పని :  కల్లూరు గ్రామంలో  కిసాన్ మిత్ర హెల్ప్ లైన్ ఎలా పని చేస్తుంది అనేది రైతులకు అవగాహన కార్యక్రమాలు చేస్తున్నప్పుడు, అక్కడ టంగుటూరు ప్రమీలమ్మ గారు ఆమె భూమి సమస్య గురించి కిసాన్ మిత్ర కార్యకర్త చెప్పటం జరిగింది.

  • కిసాన్ కిసాన్ మిత్ర కార్యకర్త ఆమె సమస్య గురించి రెవెన్యూ అధికారి దృష్టికి తీసుకెళ్లగా, వారు పరిశీలించి సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. కానీ సమస్య పరిష్కారం కాలేదు మరియు ఆ సమయంలో టంగుటూరు ప్రమీలమ్మ భూమి సమస్యను  చూస్తున్న రెవెన్యూ అధికారి బదిలీ కావడంతో ఆమె సమస్య పెండింగ్‌లో పెట్టారు, తర్వాత అప్లికేషన్ సమయం అయిపోయి రిజెక్ట్ అయింది. మేము మళ్ళీ ప్రొద్దుటూరు మీసేవ కేంద్రానికి తీసుకెళ్లి ఆమె వేలిముద్ర ద్వారా ఆథెంటిఫికేషన్ చేయించడం జరిగింది.
  • ఆ తర్వాత మళ్ళీ కొత్తగా వచ్చిన వి.ఆర్.ఓ నరసింహయ్య గారి దృష్టికి తీసుకెళ్లి అప్రూవ్ చేయించిన తర్వాత ఆమెకు నలభై అయిదు రోజుల్లో  పోస్ట్ ద్వారా ఆమె పేరుతో వారి ఇంటికి డిజిటల్ భూమి పాస్ బుక్ రావడం జరిగింది.
  •  ఆ పాస్ బుక్ ద్వారా ఆమె బ్యాంకులో పంట ఋణం తెచ్చుకున్నారు. అలాగే రైతు భరోసా ఇది వరకు వారి భర్త అకౌంట్లోకి వచ్చేది, ఇప్పుడు ఆమె బ్యాంకు  అకౌంట్లో  రైతు భరోసా మరియు పి.యం.కిసాన్ అమౌంట్ కూడా వస్తుంది.

టంగుటూరు ప్రమీలమ్మ అబిప్రాయం :   నా భర్త పోయిన దుఃఖంలో నేను  ఉన్నప్పుడు,  నా బంధువులు కూడా నాకు సహాయం చేయలేదు,  నేను ఎన్ని సార్లు అధికారులు చుట్టూ తిరిగిన నా సమస్య పరిష్కారం కాలేదు, కిసాన్ మిత్ర హెల్ప్ లైన్ కి కాల్ చేసిన తరువాత  కిసాన్ మిత్ర టీం నాకు పాస్ బుక్ వచ్చేవరకు నా వెంటే ఉండి సహాయం చేశారు. వారికి నేను ఎప్పుడు రుణపడి ఉంటాను అని చెప్పింది.