రైతు పేరు : తలారి వెంకటరమణ 
గ్రామం : దేవగుడిపల్లె
మండలం : చిన్నమండెం
జిల్లా   : YSR కడప
రాష్ట్రం :  ఆంధ్రప్రదేశ్ 

 

 AO రామాంజనేయ అచారి మరియు (భాస్కర్) కిసాన్ మిత్ర    భాస్కర్(కిసాన్ మిత్ర), రైతు తలారి వెంకటరమణ   

సమస్య : రైతు తలారి వెంకటరమణ గారికి సర్వే నెం  321/5లో 1 ఎకరం డికెటి భూమిని సాగు చేసుకుంటున్నారు వీరికి కొత్తగా పాసు బుక్ వచ్చింది. వారు ఆ భూమిలో కంది, వేరుశనగ సాగు చేసుకుంటున్నారు. అతనికి సాగు పెట్టుబడి గురించి  రైతు భరోసా రాకపోవటంతో, మండల అగ్రికల్చర్  ఆఫీస్, మండల రెవెన్యూ ఆఫీస్ కు వెళ్లి చాలా సార్లు దరఖాస్తు చేసుకున్నారు కానీ రాలేదు. అతను చాల సార్లు అధికారుల చుట్టూ తిరిగి ఇక  రైతు భరోసా రాక నిరాశ తో వున్నాడు.    

కిసాన్ మిత్రా చేసిన పని : రైతు వెంకటరమణ గారు సుస్థిర వ్యవసాయ కేంద్రం(సి.యస్.ఏ) కిసాన్ మిత్ర హెల్ప్ లైన్ ద్వారా రైతులకు చేస్తున్నటువంటి సేవలను గురించి తెలుసుకొని కిసాన్ మిత్ర హెల్ప్ లైన్ కు కాల్ చేయడం తో కిసాన్ మిత్ర టీం 2021 జనవరి 28వ తేదీన రైతు తలారి వెంకటరమణ గారి దగ్గరకు వెళ్లి సమస్యను క్షుణంగా తెలుసుకొని అందుకు సంబంధించిన డాక్యూమెంట్లు తీసుకొని, రైతుతో పాటుగా చిన్నమండెం వ్యవసాయ అధికారి రామంజనేయ ఆచారి గారిని కలిసి సమస్యను తెలియజేసి గ్రీవిన్స్ చేయించడం జరిగింది.

  • ఈ సమస్య గురించి అధికారులతో  ఫాలో అప్ చేయటం  వల్ల నెల రోజులకు తలారి వెంకటరమణకు రైతు భరోసా రావడం జరిగింది.   

రైతు వెంకటరమణ గారి అభిప్రాయం : సుస్థిర వ్యవసాయ కేంద్రం(సి.యస్.ఏ) కిసాన్ మిత్ర హెల్ప్ లైన్ కు ఫోన్ చేయడం ద్వారా సమస్యను పరిష్కరించి రైతు భరోసా వచ్చేటట్లు చేసినందుకు సంతోషం వ్యక్తం చేస్తూ కిసాన్ మిత్ర టీం కు ధన్యవాదములు తెలిపినారు.