రైతు పేరు : నాగిపోగు యల్లమ్మ
గ్రామం  :మల్లేపల్లి
మండలం  : బ్రహ్మంగారి మఠం
జిల్లా   : YSR కడప
రాష్ట్రం : ఆంధ్రప్రదేశ్

 

 

 

సమస్య : బ్రహ్మంగారి మఠం మండలం, మల్లేపల్లి గ్రామంలోని నాగిపోగు చిన్నపుల్లయ్య అనే రైతు, తనకు ఉన్న 2.18 ఎకరాల భూమిలో మిరప, పత్తి, సజ్జ, వరి పంటలు సాగుచేస్తూ ఉండేవారు. మిరప సాగుకు నీళ్లు సరిపోక పోవడంతో అప్పులు చేసి 2 బోర్లు వేయడం జరిగింది. బోర్లు వేసిన వాటిలో కొద్దిపాటి నీళ్లు రావటంతో పచ్చి మిరప పంట సాగు చేశాడు. పంటకు మొజాయిక్ వైరస్ తెగులు రావటంతో, పంట దిగుబడి సరిగా రాక సుమారు లక్ష రూపాయల వరకు అప్పులు అయినవి. అలాగే ఇంటి నిర్మాణము కొరకు దాదాపుగా 5 లక్షలు వరకు వడ్డీ వ్యాపారుల దగ్గర అధిక వడ్డీకి తెచ్చి ఇల్లు నిర్మించాడు. అలాగే అతని భార్య ముక్కు ఆపరేషన్ కోసం ఒక లక్ష ఖర్చు చేశారు.

  • ఈ క్రమంలో తీసుకున్నఅప్పులకు వడ్డీలు ఎక్కువై, తీవ్ర మనస్తాపం చెంది అహోబిలం కొండలలోకి వెళ్లి పురుగుమందు తాగి 2020 ఆగస్టు 20వ తేదిన ఆత్మహత్య చేసుకున్నారు. ఈ రైతు భార్య యల్లమ్మ (34y), కుమార్తె రమాదేవి(11y), కుమారుడు లక్షుమయ్య (11y) అనే ఇద్దరు కవల పిల్లలు ఉన్నారు. రైతు చిన్నపుల్లయ్య ఆత్మహత్య చేసుకున్నప్పుడు పోలీస్ మరియు అగ్రికల్చర్ అధికార్లు కేసు నమోదు చేసుకొని క్రైమ్ నెంబరు 108/2020గా బ్రహ్మంగారి మఠం పోలీసు స్టేషనులో నమోదు చేశారు.
  • రైతు భార్య యల్లమ్మ గారు తన భర్త మరణానంతరం తన ఇద్దరు పిల్లలను కూలీ పని చేసి పోషించుకుంటూ జీవనం సాగిస్తున్నారు. తనకు రావలిసిన ఎక్సగ్రెసియా గురించి మండల రెవిన్యూ అధికారి దగ్గర తన మరిది చిన్న పుల్లయ్య గారి సహాయంతో దరఖాస్తు  చేసుకుంది. తన భర్త ఆత్మహత్యకు సంబంధించి ఎఫ్.ఐ.ఆర్ మరియు పోస్టుమార్టం రిపోర్ట్ మరియు ఇతర డాక్యుమెంట్లు అన్ని అధికారులకు సమర్పించి ఉన్నప్పటికీ వారికి రావలసిన ఎక్సగ్రెసియా పెండింగులోనే ఉంది.
  •  యల్లమ్మగారు వారు ఎక్సగ్రెసియా పెండింగ్ గురించి బి.మఠం తహశీల్దార్ మరియు వ్యవసాయ అధికారి కార్యాలయంలో చాలాసార్లు తిరిగినప్పటికీ తగు నివేదికను మండల అధికారులు జిల్లా అధికారులు దృష్టికి తీసుకెళ్లలేదు.

కిసాన్ మిత్రా చేసిన పని : సుస్థిర వ్యవసాయ కేంద్రం(సియస్.ఏ.)కిసాన్ మిత్ర టీం మరియు ఇతర రైతు సంఘాలు, హైదరాబాద్ నుండి వచ్చిన బెహేన్ పత్రిక స్వతంత్ర విలేకరి అందరం వారి కుటుంబాన్ని 2020 నవంబర్ 20వతేది న కలసి సమస్యలను తెలుసుకోవడం జరిగింది.

  • సి.యస్.ఏ – కిసాన్ మిత్ర ద్వారా చేస్తున్న పనుల గురించి చిన్న పుల్లయ్య గారికి  తెలియడంతో 2020 ఏప్రిల్ 20వతేదిన కిసాన్ మిత్ర హెల్ప్ లైన్ కి కాల్ చేయడంతో కిసాన్ మిత్ర టీమ్ మండల స్థాయి రిపోర్ట్ మరియు డివిజనల్ స్థాయి రిపోర్ట్ గురించి ఆరా తీయగా ఫోరెన్సిక్ రిపోర్ట్ మరియు త్రిసభ్య కమిటీ రిపోర్ట్ పోలీస్ స్టేషన్ లొనే ఉండిపోయింది.
  •  ఈ విషయమై స్థానిక సబ్ ఇన్స్పెక్టర్ శ్రీనివాసులు గారిని అడుగగా ఆ రిపోర్టు త్వరగా తహాశిల్దారు గారికి పంపవలసిందిగా ఆదేశాలు ఇచ్చారు. తర్వాత తహాశిల్దారు గారిని మరియు అగ్రికల్చర్ అధికారి మల్లికార్జున రెడ్డి గారిని కలసి త్వరగా జిల్లా కమిటీకి తగు రిపోర్ట్ ను పంపాలని కోరడం జరిగింది, కొన్ని రోజుల తర్వాత కడప జిల్లా అగ్రికల్చర్ కార్యాలయంలో నుండి అడ్వాన్స్ స్టాంప్ రసీదు కూడా ఇవ్వడం జరిగింది.
  • ఎన్నికల కోడ్ ముగిసిన వెంటనే ఈ కుటుంబానికి EFMS ద్వారా అకౌంట్ లో 7 లక్షల డబ్బులు జమ అవుతాయని అగ్రికల్చర్ అధికారి మల్లికార్జున రెడ్డి గారు చెప్పారు.

రైతు భార్య యల్లమ్మ గారి అబిప్రాయం : కిసాన్ మిత్ర హెల్ప్ లైన్ కి ఫోన్ చేయటం ద్వారా సమస్యను పరిష్కరించటంలో కిసాన్ మిత్ర టీం పూర్తి సహాయ సహకారాలు అందించి ఎక్సగ్రెసియా వచ్చేలా కృషి చేసారు, వారికీ ధన్యవాదాలు…