రైతు పేరు.   : పుల్లగూర లక్ష్మీదేవి
 గ్రామం       : మిదిపెంట్ల (భూమయ్యగారిపల్లి GP)
మండలం   : వేముల
జిల్లా.        : వై.యస్.ఆర్.కడప
రాష్ట్రం :  ఆంధ్రప్రదేశ్ 

 

 

పుల్లగూర లక్ష్మిదేవి భర్త శ్రీరాములు, భాస్కర్,            వ్యవసాయ అధికారి తో ఇష్యూని చర్చించటం

సమస్య : వేముల మండలంలోని మిదిపెంట్ల గ్రామానికి చెందిన పుల్లగూర లక్ష్మీదేవి భర్త శ్రీనివాసులు అనే మహిళ రైతుకు మొదటి నుండి రైతు భరోసా డబ్బులు రావడం లేదు ఆ రైతు చాలా సార్లు వాలంటరీ ద్వారా రైతు భరోసా కేంద్రం కు వెళ్లి తెలియజేయడం జరిగింది కానీ రైతు భరోసా డబ్బులు రాకపోవడంతో ఇంకా రైతు భరోసా డబ్బులు రావని నిరాశ తో వున్నారు.

కిసాన్ మిత్ర చేసిన పని : సుస్థిర వ్యవసాయ కేంద్రం కిసాన్ మిత్ర హెల్ప్ లైన్ ద్వారా రైతులకు అందిస్తున్న సేవా కార్యక్రమాల గురించి మిదిపెంట్ల గ్రామం వెళ్లి అవగాహన కలిపించినప్పుడు ఈ మహిళ రైతు కు రైతు భరోసా రాలేదని తెలియజేశారు. రైతుకు సంబంధించిన ఆధార్ తో  రైతు భరోసా స్టేటస్ చూడగా ల్యాండ్ నేచర్ లో ఇన్ ఎలిజిబుల్ ల్యాండ్ (ప్రభుత్వ భూమి) అని ఉండడంతో  27 జనవరి 2021 న వేముల మండల అగ్రికల్చర్ అధికారి చెన్నారెడ్డి సార్ గారిని కలిసి గ్రీవెన్స్ చేయించడం జరిగింది. ఆ తరువాత అక్టోబరు నెలలోనే రైతు భరోసా డబ్బులు అకౌంట్ లో జమకావడం జరిగింది. ఈ రైతుతో పాటుగా ఇంకో  4 మంది రైతులకు కూడా రావటం జరిగింది.

రైతు లక్ష్మీదేవి గారి స్పందన : 2019 నుండి రైతు భరోసా డబ్బుల ల కోసం ఎన్ని సార్లు రైతు భరోసా కేంద్రం చుట్టూ తిరిగినా కూడా డబ్బులు రాకపోవడంతో ఇంకా డబ్బులు రావని నిర్ణయానికి వచ్చినప్పుడు కిసాన్ మిత్ర టీం ద్వారా రైతు భరోసా పెండింగ్ సమస్యను పరిష్కరించి నాకు రైతు భరోసా డబ్బులు ఇప్పించినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.