రైతు పేరు : పోలు అనురాధ
గ్రామం  :రాజువారిపేట
మండలం  : చాపాడు
జిల్లా   : YSR కడప
రాష్ట్రం : ఆంధ్రప్రదేశ్
 

గేదెను పరిశీలించడం                        పాలిచ్చే గేదెను ఇవ్వడం

సమస్య : చాపాడు మండలం, రాజువారిపేట గ్రామంలోని పోలు సుధాకర్ రెడ్డి అనే రైతు, తనకు ఉన్న ఒక ఎకరం భూమిలో  మరియు 3 ఎకరాలు భూమిని కౌలుకు తీసుకొని మిరప, వరి పంటలు సాగు చేస్తూ ఉండేవారు. అధిక వర్షాల వలన పంట నష్టపోయారు అలాగే మిరప పంటలో జెమిని వైరస్ తెగులు వలన మిరప దిగుబడి రాక పూర్తిగా నష్టం వాటిల్లింది.

  • పంటలలో సరైన దిగుబడి రాకా వచ్చిన దిగుబడికి ప్రభుత్వ నుంచి మద్దతు ధరలు లేక పెట్టిన పెట్టుబడికి నికర ఆదాయం రాలేదు అలాగే ఇంటి నిర్మాణము కొరకు దాదాపుగా 5 లక్షలు వరకు వడ్డీ వ్యాపారుల దగ్గర అధిక వడ్డీకి తెచ్చి ఇల్లు నిర్మించాడు. అప్పులు వారి దగ్గర నుండి డబ్బులు కట్టమని ఒత్తిడి తెచ్చేవారు.
  • ఏమి దిక్కు తెలియని పరిస్థితిలో 10-05-2016వ తేదీన  తన పొలంలోనే  పురుగుల మందు త్రాగి ఆత్మహత్య చేసుకొన్నాడు. వీరికి ఇద్దరు కుమారులు, ఒకరు అశ్వథామరెడ్డి (22 y) బి.టెక్ చదువుతున్నారు, ఇంకొకరు మణి కంటారెడ్డి (20y)డిప్లొమా చదువుతున్నారు.

కిసాన్ మిత్ర చేసిన పని : జిల్లాలో రైతు ఆత్మహత్యల గురించి కిసాన్ మిత్ర టీం మరియు రైతు సంఘాలు సర్వే చేస్తున్నపుడు పోలు సుధాకర్ రెడ్డి కుటుంభాన్ని కలువగా రైతు భార్య  పోలు అనురాధ గారు చెప్పిన విషయం ఏమంటే నా భర్త చనిపోయిన తర్వాత అంత్యక్రియలు చేసే క్రమంలో మా కుటుంభ ఆచారము ప్రకారము పూర్వం మా పెద్దలు ఎవరైనా మా కుటుంభం లో చనిపోతే దహనం చేసేవారు ఆ విధంగా నా భర్తను కూడా దహనం చేశాము .దహనం చేసే ముందు గ్రామ నౌకరికి తెలియజేశాము అని తెలిపారు .

  • ఆ తర్వాత పోలీస్ స్టేషన్ కెళ్ళి కేసు నమోదు చేయమంటే పోలీసు వారు FIR నమోదు చేయలేదు, ఈ విషయం తెలుసుకున్న రైతు సంఘాలో పని చేసే శివ రెడ్డి గారు కిసాన్ మిత్ర టీమ్ మండల తహశీల్దారు మరియు జిల్లా కలెక్టరు గారి దృష్టికి తీసుకెళ్ళి రైతు ఆత్మహత్యగా నిర్ధారించి ప్రభుత్వ నుంచి ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలని డిమాండ్ చేశారు కాని ఇప్పటి వరకు ప్రభుత్వ నుంచి ఎలాంటి ఆర్ధిక భరోసా రాలేదు.
  • ఈ కుటుంభానికి అండగా ఉండడానికి జీవనోపాధి నిమిత్తము ఏమి కావాలని పోలు అనురాధ గారిని అడుగగా నాకు పాలిచ్చే గేదెను కొనివ్వాలని కోరగా,  చాపాడు మండలంలోని రాజువారిపేట గ్రామంలో లక్కిరెడ్డి ప్రసాద్ రెడ్డి w/o రమాదేవి గారి (9676355182) గేదెను పరిశీలించడం జరిగింది. గేదె విలువ ₹40000/-లుకు కొనుగోలు అవుతుందని చెప్పారు.
  • ఇందులో రైతు వాటా సాయి రాం పొదుపు సంఘము స్త్రీ నిధి ద్వారా ₹15000/-లు మరియు రైతు స్వరాజ్య వేదిక తరుపున  ₹25000/-లు నగదును కలిపి  మొత్తము 40000/-రూపాయలను చెల్లించి 8/04/2021 తేదిన పోలు అనురాధ గారికి  ఒక పాలిచ్చే గేదెను కొనివ్వడం జరిగింది. తర్వాత జిల్లాలో జనసేన వారికి కూడా  రైతు ఆత్మహత్య గురించి వివరించి  మన దగ్గర వున్నా డేటా వారికి షేర్ చేయడం ద్వార వారినుంచి కూడా 100000/- రూపాయల చెక్ కూడా  20/08/2022 ఇవ్వడం జరిగింది.

రైతు భార్య పోలు అనురాధ గారి అబిప్రాయం : కిసాన్ మిత్ర హెల్ప్ లైన్ కి ఫోన్ చేయటం ద్వారా సమస్యను పరిష్కరించటంలో కిసాన్ మిత్ర టీం పూర్తి సహాయ సహకారాలు అందించి ఆర్ధిక సహాయం వచ్చేలా కృషి చేసారు వారికీ ధన్యవాదాలు..…