రైతు పేరు : రాచుగోళ్ల ఓబులేసు
గ్రామం : లక్ష్మీ బాలజీనగర్
మండలం : బి.మఠం మండలం
జిల్లా : వై.యస్.ఆర్ కడప
రాష్ట్రం : ఆంధ్రప్రదేశ్
సమస్య : బి.మఠం మండలం లక్ష్మీ బాలజీనగర్ లోని రాచుగోళ్ల ఓబులేసు అనే రైతుకు 2006 సంవత్సరంలో సర్వే నెం :- 1236/3 లో ఒక ఎకరం డికెటి పట్టా భూమి ఇవ్వడం జరిగింది. వారు ఆ భూమిలో వరి, మినుము మరియు టమోటా సాగు చేసుకుంటున్నారు. రైతు ఆ భూమిలో గత 14 సంవత్సరాల నుండి సాగుదారులు అయినప్పటికి సాగు పెట్టుబడి కోసం రైతు భరోసా రాకపోవడంతో గ్రామంలో రైతు భరోసా కేంద్రంకు, మండల అగ్రికల్చర్ ఆఫీస్ మరియు మండల రెవెన్యూ ఆఫీస్ కి చాలాసార్లు తిరిగినప్పటికి రైతుభరోసా అందకపోవడంతో నిరాశతో ఉండిపోయారు.
- కారణం ఏమిటంటే ఆ గ్రామములో అందరికి DKT భూములు ఉన్నాయి. ఈ రైతుకు కూడా DKTభూమి ఇచ్చారు. కానీ రైతు భరోసా వెబ్ సైట్ లో ప్రభుత్వ భూమి అని చూపిస్తూ ఉంది అని రైతు నాకు రైతు భరోసా రాదు అనే ఊహలో ఉండేవారు, కారణం మొదట రైతు భరోసా వచ్చే సమయానికి ఆయన పన్ను చెల్లించే వారుగా వెబ్ సైట్ లో ఉండేది తర్వాత సచివాలయంలో అర్జీ పెట్టిన తర్వాత ప్రభుత్వ భూమి అని చూపించేది. ఆయన విసుగు చెంది కిసాన్ మిత్ర హెల్ప్ లైన్ కాల్ చేసి సమస్య చెప్పారు.
కిసాన్ మిత్ర చేసిన పని : రైతు రాచుగోళ్ల ఓబులేసు గారి సమస్య తెలుసుకొని స్థానిక సచివాలయంలో సమస్య చెప్పి వారి లాగిన్స్ లో అప్రూవ్ చేయించాటం జరిగింది. తర్వాత మండల రెవెన్యూ ఆఫీసుకి వెళ్లి తహశీల్దార్ గారికి సమస్య చెప్పగా అప్పుడు వారు వెబ్ ల్యాండ్ లో ప్రభుత్వ భూమి అనే దానిని తొలగించి సరిచేయడం ద్వారా ప్రస్తుతం వారికి రైతు భరోసా డబ్బులు వస్తున్నాయి. ఈ విషయాన్ని రైతుకు స్వయంగా వెళ్లి చెప్పగా తన బ్యాంక్ అకౌంట్ లో అమౌంట్ చెక్ చేయగా అమౌంట్ లేదు.
- కారణం వెతకగా ఎవరో బ్యాంక్ నుండి డబ్బులు డ్రా చేస్తున్నారని బ్యాంక్ అధికారులు చెప్పగా మోసపోయానని తెలుసుకొని అప్పుడే తన ATM కార్డుని బ్లాక్ చేయించడం జరిగింది. ప్రస్తుతం అతనికి రైతుబరోసా డబ్బులు వస్తున్నవి.
రైతు రాచుగోళ్ళ ఓబులేసు గారి అభిప్రాయం: కిసాన్ మిత్ర హెల్ప్ లైన్ కు కాల్ చేయడం ద్వారా సంవత్సరం నుండి పెండింగ్ లో ఉన్న రైతు భరోసా సమస్యను పరిష్కరించి, 5500/- రైతు భరోసా డబ్బులు ఒకే సారి వచ్చేటట్లు సహకరించిన సుస్థిర వ్యవసాయ కేంద్రం -కిసాన్ మిత్ర టీం కు రైతులే స్వయంగా కిసాన్ మిత్ర హెల్ప్ లైన్ కి కాల్ చేసి ధన్యవాదాలు చెప్పడం జరిగింది.