రైతు పేరు : నుకనబోయిన నారాయణమ్మ
గ్రామం : మాచానూరు
మండలం : పెండ్లిమర్రి
జిల్లా : YSR కడప
రాష్ట్రం : ఆంధ్రప్రదేశ్
సమస్య : పెండ్లిమర్రి మండలంలోని మాచానూరు గ్రామంలో నుకనబోయిన రామంజనమ్మ గారికి సర్వే నెంబర్ 601లో 4.68 ఎకరాల డికెటి పట్టా భూమి ఉంది. దానిలో కుమారుడు రామ్ మోహన్ గారితో కలిసి వరి, వేరుశనగ మరియు శనగ పంటలు సాగు చేసుకుంటూ వున్నారు. వీరు వాస్తవ సాగుదారులు అయినప్పటికీ వీరికి ప్రభుత్వం నుండి రావలసిన రైతు భరోసా రావడం లేదు.
- ఈ సమస్య గురించి మండల అగ్రికల్చర్ ఆఫీస్ కు వెళ్ళితే డికెటి భూములకు డిఫార్మ్ పట్టా ఉంటేనే రైతు భరోసా వస్తుంది చెప్పారు. ఈ సమస్య మండల రెవిన్యూ పరిధిలో పెండింగ్ ఉందని తెలిపగా మండల రెవిన్యూ ఆఫీస్ చుట్టూ చాలా సార్లు తిరిగినప్పటికి ఉపయోగం లేకపోవడంతో ఇంకా రైతు భరోసా రాదని ప్రభుత్వం అందించే సాగు పెట్టుబడి పై ఆశ వదిలేసినారు.
- ఇదే గ్రామంలో ఓబయ్య మరియు రామాంజనేయులుకు కూడా ఇలాంటి సమస్య తోనే ఇబ్బంది పడుతున్నారు.
కిసాన్ మిత్ర చేసిన పని : సుస్థిర వ్యవసాయ కేంద్రం(CSA) ద్వారా నిర్వహిస్తున్న కిసాన్ మిత్ర హెల్ప్ లైన్ గురించి రైతులకు అవగాహన కలిపించడంలో భాగాంగా పెండ్లిమర్రి మండలంలోని మాచానూరు గ్రామానికి వెళ్లి వ్యవసాయానికి సంబంధించి రైతులు ఎదుర్కొంటున్న సమస్యల పరిస్కారం కోసం రైతులకు అండగా కిసాన్ మిత్ర హెల్ప్ లైన్ పని చేస్తుందని అవగాహన కలిపించడం జరిగింది.
- రైతు నారాయనమ్మ గారి కుమారుడు రామమోహన్ గారు హెల్ప్ లైన్ గురించి తెలుసుకొని కిసాన్ మిత్ర హెల్ప్ లైన్ కు కాల్ చేయడం జరిగింది. కిసాన్ మిత్ర టీం వెళ్లి బాధిత రైతు నారాయనమ్మ, రామ్మోహన్, ఓబయ్య గారిని కలిసి వారి ఆధార్ నెంబర్ ఆధారంగా రైతు భరోసా వెబ్ సైట్ లో చూడగా ల్యాండ్ నేచర్ లో గవర్నమెంట్ ల్యాండ్/ఇన్ ఎలిజిబుల్ ల్యాండ్ అని ఉంది.
- రైతులకు సంబంధించిన డాక్యూమెంట్లు తీసుకొని మండల అగ్రికల్చర్ ఆఫీస్ కు వెళ్లి AO గారిని కలిసి ఈ రైతులకు పాస్ బుక్ లు ఉన్నాయి, భూమి ఆన్లైన్(1బీ) ఉంది, ఆ భూమిలో చాల సంవత్సరల నుండి సాగు చేస్తున్నారు కాబట్టి రైతు భరోసా ఇప్పించవలసినదిగా తెలియజేయడం జరిగింది.
- మాచానూరు రైతు భరోసా కేంద్రంకు వెళ్లి అగ్రికల్చర్ అసిస్టెంట్ ను కలిసి ముగ్గురు రైతుల రైతు భరోసా గురించి 2021 జనవరి 25న గ్రీవెన్సు చేయించడం జరిగింది. వీరికి 18.05.2021న రైతు భరోసా డబ్బులు వారి అకౌంట్ లో జమకావడం జరిగింది.
రైతుల స్పందన : కిసాన్ మిత్ర హెల్ప్ లైన్ కు కాల్ చేయడం ద్వారా మొదటి నుండి పెండింగ్ లో ఉండి ఇంకా రావు అనుకున్న రైతు భరోసా డబ్బులు ఇప్పించినందుకు కిసాన్ మిత్ర టీంకు ధన్యవాదాలు తెలిపినారు.