రైతు పేరు : వెలితేర్ల నాగేశ్వరమ్మ
గ్రామం : బక్కన్నగారిపల్లి
మండలం పేరు : వేంపల్లి
జిల్లా : YSR కడప
రాష్ట్రం : ఆంధ్రప్రదేశ్
సమస్య : వేంపల్లి మండలం బక్కన్నగారిపల్లి లోని వెలితేర్ల నాగేశ్వరమ్మ భర్త బాల బయన్న అనే మహిళ రైతుకు 2006 సంవత్సరంలో సర్వే నెంబర్ 1008/2లో 2.5 ఎకరాల డికెటి పట్టా భూమి ఇవ్వడం జరిగింది. గత 15 సంవత్సరల నుండి వారు ఆ భూమిలో అరటి, బంతి మరియు టమోటా సాగు చేసుకుంటున్నారు.
- ఆ మహిళ రైతు సాగుదారులు అయినప్పటికి సాగు పెట్టుబడి కోసం రైతు భరోసా రాకపోవడంతో గ్రామంలోని రైతు భరోసా కేంద్రంకు, మండల అగ్రికల్చర్ ఆఫీస్ కు మరియు మండల రెవిన్యూ ఆఫీస్ కు చాలా సార్లు తిరిగినప్పటికి రైతు భరోసా అందకపోవడంతో నిరాశతో ఉండి పోయారు.
కిసాన్ మిత్రా చేసిన పని : రైతు నాగేశ్వరమ్మ గారి భర్త బాల బయన్న గారికి సుస్థిర వ్యవసాయ కేంద్రం – కిసాన్ మిత్ర హెల్ప్ లైన్ ద్వారా చేస్తున్న సేవల గురించి తెలియడంతో బాలబయన్న గారు 2020 డిసెంబర్ 1వ తేదీన కిసాన్ మిత్ర హెల్ప్ లైన్ కు కాల్ చేయడం జరిగింది.
- కిసాన్ మిత్ర టీం 2020 డిసెంబర్ 3వ తేదీన రైతు బాలబయన్న గారిని కలిసి సమస్య తెలుసుకొని రైతు భార్య నాగేశ్వరమ్మ గారి ఆధార్ నెంబర్ తో రైతు భరోసా స్టేటస్ లో చూడగా ల్యాండ్ నేచర్ లో “గవర్నమెంట్/ఇన్ఎలిజబుల్ ల్యాండ్” అని వుండడంతో రైతుకు సంబంధించిన డి.ఫార్మ్ పట్టా, ఆధార్, భూమి పాస్ బుక్, బ్యాంక్ అకౌంట్ జిరాక్స్ లు తీసుకొని మండల రెవిన్యూ కార్యాలయంలో VRO మధు గారికి మరియు తహసీల్దార్ చంద్రశేఖర్ రెడ్డి గారిని కలిసి సమస్యను తెలియజేయగా భూమి రికార్డ్ లు పరిశీలించి అప్రూవ్ చేసి వ్యవసాయ అధికారి అయిన లావణ్య గారికి పంపారు.
- రైతుతోని అగ్రికల్చర్ ఆఫీస్ లో రైతు భరోసా గురించి గ్రీవిన్స్ చేయించడం జరిగింది. కొన్ని రోజుల తరువాత 2020 డిసెంబర్ 20వ తేదీన రైతు నాగేశ్వరమ్మ గారికి రైతు భరోసా 7500/- రావడం జరిగింది.
రైతు బాలబయన్న గారి అభిప్రాయం: కిసాన్ మిత్ర హెల్ప్ లైన్ కు కాల్ చేయడం ద్వారా సంవత్సరం నుండి పెండింగ్ లో ఉన్న రైతు భరోసా సమస్యను పరిష్కరించి 7500/- రైతు భరోసా డబ్బులు ఒకేసారి వచ్చేటట్టు సహకరించిన సుస్థిర వ్యవసాయ కేంద్రం -కిసాన్ మిత్ర టీం కు ధన్యవాదాలు తెలిపారు.