రైతు పేరు.    : శ్రీరామ జాస్మిన్  
గ్రామం          : కల్లూరు 
మండలం     : ప్రొద్దుటూరు 
జిల్లా.             : వై.యస్.ఆర్.కడప
రాష్ట్రం :  ఆంధ్రప్రదేశ్ 

 

 

 

 

సమస్య : కిసాన్ మిత్ర హెల్ప్ లైన్ కార్యకర్తలు  ప్రొద్దుటూరు మండలం కల్లూరు మరియు తాళ్లమాపురం గ్రామాలలో  కౌలు రైతులకు కౌలు కార్డుల గురించి అవగాహన కార్యక్రమాలు చేస్తున్న క్రమంలో శ్రీరామా జాస్మిన్ గారి సమస్య గురించి చెప్పడం జరిగింది. తాను శ్రీ చిరెడ్డి మధుసూధన్ రెడ్డి అనే భూ యజమాని దగ్గర మొత్తం ఏడు ఎకరాల వర్షాధార భూమిని యజమాని అంగీకారంతో పదకొండు నెలల కాలానికి భూమిని కౌలుకు తీసుకోవడం జరిగింది. కానీ ఈ కౌలు కార్డు గురించి ఎక్కడ దరఖాస్తు చేసిన కానీ ఎప్పుడు నాకు కౌలు కార్డు రాలేదు అని చెప్పింది.

కిసాన్ మిత్రా చేసిన పని : శ్రీరామా జాస్మిన్ గారు కౌలు తీసుకున్న భూమి యజమాని అయిన  శ్రీ చిరెడ్డి మధుసూధన్ రెడ్డి గారికి ఈ కౌలు కార్డు  గురించి చెప్పి, తన దగ్గర ఈ కార్డు కొరకు శ్రీరామ జాస్మిన్ దరఖాస్తు  గురించి  అంగీకారం తీసుకొని, తర్వాత స్థానిక గ్రామ రెవెన్యూ అధికారి దగ్గరికి వెళ్లి కౌలు కార్డు కోసం దరఖాస్తు చేసుకోవడం వల్ల, రైతుకు  కౌలు కార్డు జారీ చేశారు. తర్వాత గ్రామ వ్యవసాయ సహాయకుడు దగ్గరికి వెళ్లి కౌలు రైతు భరోసా నిధి కోసం దరఖాస్తు చేయగా 2023-24 సంవత్సరానికి 13500/- రూపాయలు రైతు భరోసా నిధి డబ్బులు రావడం జరిగింది. మరియు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2023 జూన్ నెలలో విడుదల చేసిన పంటల బీమా  మొత్తం రూ 89802/-లు పత్తి పంటకు పంటల బీమా రావడం జరిగింది,

  •  అలాగే పత్తి పంటలో శాస్త్రవేత్తలతో కూడా వారి పంట పొలాలను విజిట్ చేయించి పంట యాజమాన్య పద్ధతులు మరియు చీడపీడల గురించి మరియు వ్యవసాయ వాతావరణ అనుకూల మరియు ప్రతికూల పరిస్థితుల గురించి సలహాలు సూచనలు ఇప్పించడం జరిగింది.

శ్రీరామ జాస్మిన్  అబిప్రాయం :  భూ యజమానికి సరైన అవగాహన లేక కొన్ని అపోహలు ఉన్నందున తన అంగీకారం ఇవ్వలేదు. తర్వాత కిసాన్ మిత్ర టీం ప్రొద్దుటూరు రైతు ఉత్పత్తి దారుల కంపెనీ లిమిటెడ్  నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో కౌలు కార్డు గురించి చెప్పడం వల్ల,  శ్రీరామ జాస్మిన్ గారు తన సమస్య గురించి చెప్పడం ద్వారా  భూమి యజమాని అయిన శ్రీ చిరెడ్డి మధుసూధన్ రెడ్డి తో  కిసాన్ మిత్ర టీం మాట్లాడి ఒప్పించటం జరిగింది. తర్వాత శ్రీరామ జాస్మిన్ గారికి  కౌలు కార్డు రావడం ద్వారా రైతు భరోసా నిధి, పత్తి పంటకు సంబంధించిన బీమా కూడా రావడం జరిగింది. కిసాన్ మిత్ర టీం రైతులకు అండగా ఉంటూ ఇలాంటి మంచి కార్యక్రమాలు చేయడం ద్వారా అందరికీ మంచి జరుగుతుంది అని రైతు చెప్పారు, అలాగే  సుస్థిర వ్యవసాయ కేంద్రం ద్వారా నడపబడుతున్న కిసాన్ మిత్ర సర్వీస్ లో పని చేస్తున్న టీంకు ఎప్పుడు  రుణపడి ఉంటాను అని రైతు సంతోషంగా చెప్పారు.